అధికారులు పనులను వేగవంతంగా పూర్తిచేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Published : Jun 9, 2024, 3:43 PM IST
Deputy CM Bhatti Vikramarka On Development works : తెలంగాణ ఎన్నికల కోడ్ ముగియడంతో అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టి సారించారు. ఖమ్మంలో పనులను వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మధిర అభివృద్ధిపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై హామీలు ఇచ్చామని అధికారులు జవాబు దారి తనంతో పనిచేయాలన్నారు. మధిర మున్సిపాలిటీ అండర్ డ్రైనేజీ నిర్మాణం కొరకు రూ. 128 కోట్ల రూపాయల నిధులను డిప్యూటీ సీఎం భట్టి మంజూరు చేశారు.