ARMY CYCLE YATRA 5500km: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కశ్మీర్‌లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన సైకిల్ యాత్ర 5500 కి.మీ. ప్రయాణించి అండమాన్ నికోబార్‌లోని ఇందిరా పాయింట్‌కు చేరుకోనుంది. హైదరాబాద్ చేరుకున్న ఈ బృందం యాత్రను ఆంధ్ర - తెలంగాణ సబ్ ఏరియా జీఓసీ రాకేష్ జెండా ఊపి ప్రారంభించారు.
కశ్మీర్ నుంచి అండమాన్ వరకు జవాన్ల సైకిల్ యాత్ర
Published : Sep 6, 2024, 5:36 PM IST
ఆర్మీలోని వివిధ విభాగాలకు సంబంధించి 26 మంది సైనిక బృందం త్వరలో ఇందిరా పాయింట్ చేరుకుంటుందని తెలిపారు. దేశ భద్రత, రక్షణే ధ్యేయంగా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. సైకిల్ యాత్ర ముగింపు ప్రాంతమైన ఇందిరా పాయింట్ వద్ద ఆర్మీ విశ్రాంత ఉద్యోగులతో పాటు విశ్రాంత వితంతువులను కూడా కలుస్తామని తెలిపారు. అండమాన్ నికోబార్‌లో స్కోబా డ్రైవింగ్ చేస్తూ నీటి అడుగున జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తామన్నారు.