national

సైబర్​ నేరగాళ్లకు పోలీసుల ఝలక్ - 22 నిమిషాల్లో ఖాతా ఫ్రీజ్‌

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 5:30 PM IST

Cyber Fraud In Hyderabad
POLICE AWARENESS ON CYBERFRAUD (ETV Bharat)

Cyber Fraud :గడిచిన మూడ్రోజుల్లో నిందితుల ఖాతాల్లో నగదు మాయమవకుండా సైబర్‌ క్రైమ్ కృషి చేసింది. జులై 9న నగరానికి చెందిన వ్యక్తి సైబర్ మోసం వల్ల తన ఖాతాలో నుంచి డబ్బు మాయమైనట్లు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 22 నిమిషాల్లో అతని ఖాతాకు సంబంధించి 17 లక్షల 45 వేల 31 రూపాయలను ఫ్రీజ్‌ చేశారని సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపారు.

గురువారం మరో వ్యక్తికి సంబంధించి రూ. 3.79లక్షలు, అలాగే ఇంకో బాధితుడికి సంబంధించి 97 వేల 312 రూపాయలను ఫ్రీజ్‌ చేశారు. ఈ సందర్భంగా తమ టీమ్ పనితీరును డీసీపీ ప్రశంసించారు. సైబర్‌ క్రైమ్ జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఖాతాలోంచి డబ్బు నేరగాళ్లకు బదిలీ కాకుండా చేసే అవకాశం ఉందని తెలిపారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి కాల్‌ లేదా www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details