చిరుధాన్యాలతో ఆశీర్వదిస్తున్న విజ్ఞాధిపతి - Ganesha with millets in nampally - GANESHA WITH MILLETS IN NAMPALLY
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2024, 5:28 PM IST
MILLETS GANESHA : మారుతున్న జీవన శైలి, భిన్న అలవాట్ల నేపథ్యంలో వినూత్న ఆలోచనతో చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని నాంపల్లిలో ఐదు రకాల చిరుధాన్యాలతో గణనాధుడిని తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ, సామాజిక, పోషకాహార భద్రతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ కార్యాలయంలో ఈ సంస్థ ఉద్యోగులు, మహిళా సిబ్బంది చిరుధాన్యాలతో గణపయ్య ప్రతిమను తయారు చేసి పూజిస్తున్నారు.
చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలన్న లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఈ విగ్రహం విశేష పూజలను అందుకొంటోంది. గతేడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పెద్ద ఎత్తున దేశం మొత్తం జరుపుకున్న వేళ అదే స్ఫూర్తిని మరింతగా కొనసాగించేందుకు మిల్లెట్స్, బెల్లం ఉపయోగించి బొజ్జ గణపయ్యను తయారు చేశామని వారు తెలిపారు. ఇవే కాకుండా వీటి ఉత్పత్తులను సైతం అందిస్తున్నామని ఈ సంస్థ మేనేజర్ మల్లికార్జున్ అన్నారు.