Border Gavaskar Trophy 2024-25 : భారత్- ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. క్రికెట్లో టాప్- 2 జట్లుగా కొనసాగుతున్న ఈ రెండు టీమ్స్ మధ్య ఏ ఫార్మాట్లో మ్యాచ్ అయినా రసవత్తరంగా సాగుతుంది. అయితే గత ఏడాది ఆసీస్ 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది ఆస్ట్రేలియా. దీంతో 2024 టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఆసీస్‌పై నెగ్గి వాళ్ల ఆశలపై నీళ్లు చల్లిన భారత్ కొంత వరకు ప్రతీకారం తీర్చుకుంది.
అయితే ఇప్పుడు నవంబర్‌లో ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోనూ నెగ్గి ఆసీస్‌పై ఆధిపత్యం చలాయించాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భారతీయులు (టీమ్ఇండియా) ఏ ఫార్మాట్లోనైనా ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇష్టపడుతారని ఖవాజా అన్నాడు.
'గత రెండేళ్లుగా మేం (ఆసీస్, భారత్) వరల్డ్ నెం 1, నెం 2 జట్లుగా ఉన్నాం. టెస్టుల్లో చివరిసారిగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడ్డాం. మా మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. నాకు తెలుసు ఏ ఫార్మాట్లోనైనా మమ్మల్ని ఓడించడానికి ఇండియన్స్ ఇష్టపడతారు. చాలా ఏళ్లుగా క్రికెట్లో భారత్ ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది. అయితే ఆసీస్‌ను ఓడించడం భారత్‌కు మాత్రం విశేషం. ముఖ్యంగా గత రెండు బోర్డర్ గావస్కర్ ట్రోఫీల్లో భారత్ నెగ్గినప్పటినుంచి వాళ్ల ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది' అని ఖవాజా స్టార్‌స్పోర్ట్స్ ఎక్స్‌క్లూజివ్‌లో మాట్లాడాడు.
కాగా, 2024-25 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ టోర్నీ నవంబర్ 22న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో నెగ్గి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు మార్గం సుగమం చేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది.
షెడ్యూల్
తొలి టెస్టు | నవంబర్ 22 - నవంబర్ 26 | పెర్త్ |
రెండో టెస్టు | డిసెంబర్ 06 - డిసెంబర్ 10 | అడిలైడ్ |
మూడో టెస్టు | డిసెంబర్ 14 - డిసెంబర్ 18 | బ్రిస్బేన్ |
నాలుగో టెస్టు | డిసెంబర్ 26 - డిసెంబర్ 30 | మెల్బోర్న్ |
ఐదో టెస్టు | జనవరి 03 - జనవరి 07 | సిడ్నీ |
'భారత్ పిచ్‌లపై ఇంగ్లాండ్ పప్పులుడకవ్- టీమ్ఇండియాకు 'విరాట్‌బాల్' ఉంది'