ETV Bharat / offbeat

మీ శరీరం నుంచి "బ్యాడ్​ స్మెల్"​ వస్తోందా? - దీనికి కారణం ఏంటో తెలుసా? - BODY ODOUR CAUSES - BODY ODOUR CAUSES

Causes of Body Odour : మీ శరీరం నుంచి చెమటతో కూడిన బ్యాడ్​ స్మెల్​ వస్తోందా? అయితే, ఈ కథనం తప్పకుండా చదవండి! ఎక్కువగా చెమటలు ఎందుకు పడతాయి? శరీర దుర్వాసన తగ్గించుకోవడానికి ఏం చేయాలి? అనే విషయాలు తెలుసుకోండి.

Body Odour
Causes of Body Odour (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Sep 9, 2024, 12:33 PM IST

Reasons For Body Odour : కొంత మందికి ఏ వాతావరణంలోనైనా చెమటలు అధికంగా పడుతుంటాయి. దీంతో బాడీ నుంచి దుర్వాసన వస్తుంటుంది. శరీర దుర్వాసన తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల సెంట్​ బాటిల్స్​, డియోడరెంట్లు ఉపయోగిస్తుంటారు. కానీ, ఇవి తాత్కలికంగా చెమట వాసనను తగ్గించినా.. శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపించలేవు. మరి.. చెమట కంపు ఎందుకు వస్తుంది ? బ్యాడ్​ స్మెల్​ రాకుండా ఎలాంటి చిట్కాలను పాటించాలి అనే విషయాలను హైదరాబాద్​కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్​ 'డాక్టర్​ చంద్రావతి' వివరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..

సహజంగానే వాతావరణ పరిస్థితుల వల్ల మనకు చెమట పడుతుంటుంది. కొద్దిగా చెమట పట్టడం మంచిదే. కానీ, ఏ వాతావరణంలోనైనా చెమటలు అధికంగా పడుతుంటే దీనిని ఒక సమస్యగా భావించాలి. కొంతమందికి అరచేతులు, అరికాళ్లలో చెమటలు ఎక్కువగా పడితే, మరికొందరికి చంకల్లో చెమటలు పడుతుంటాయి. అలాగే ముఖంపైనా, తలలోనూ చెమటలు పడుతుంటాయని డాక్టర్​ చంద్రావతి చెబుతున్నారు.

కారణం ఇదే!

చెమట గ్రంథులు అధికంగా చెమటను ఉత్పత్తి చేసినప్పుడు ఇలా జరుగుతుంటుంది. దీనివల్ల కొంతమందిలో శరీరం నుంచి బ్యాడ్​ స్మెల్​ వస్తుంది. ఈ సమస్య తీవ్రంగా ఉన్నవారిలో చెమట రంగు మారి బట్టలు కూడా పాడైపోతాయి. అయితే, కొందరిలో ఈ సమస్య చిన్నప్పటి నుంచి ఉంటుంది. మరికొందరిలో న్యూరలాజికల్​ ప్రాబ్లమ్స్​తో వస్తుందని డాక్టర్​ చంద్రావతి చెబుతున్నారు.

మెడిసిన్​ వాడితో పూర్తిగా తగ్గుతుందా ?
చాలా మంది కొన్ని రోజులు మందులు వాడుకుంటే శాశ్వతంగా శరీరం నుంచి దుర్ఘంధం రాకుండా చూసుకోవచ్చని అనుకుంటుంటారు. కానీ, మెడిసిన్​ వాడడం వల్ల తాత్కలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. మందులు శాశ్వత పరిష్కారాన్ని చూపించలేవని డాక్టర్ చంద్రావతి తెలిపారు.

చెమట కంపుకి ఇలా చెక్​ పెట్టండి!

  • చెమటలు ఎక్కువగా పట్టే వారికి బ్లడ్​ టెస్ట్​, కొన్ని స్కాన్స్​ చేసి సమస్యకి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చు. ఇంటర్నల్​గా ఎలాంటి ప్రాబ్లమ్​ లేదని గుర్తించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్​ చంద్రావతి పేర్కొన్నారు.
  • ముందుగా ఈ సమస్య ఉన్నవారు రోజుకి రెండుసార్లు తప్పకుండా స్నానం చేయాలి.
  • అలాగే డియోడరెంట్లను వాడుకోవాలి. వీటివల్ల చెమట దుర్వాసన తగ్గిపోతుంది.
  • చెమటను పీల్చుకునే బట్టలు వేసుకోవాలి. కొంచెం వదులుగా ఉన్న దుస్తులు వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఇలా చిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీరం నుంచి వచ్చే బ్యాడ్​ స్మెల్​ సమస్య చాలా వరకు తగ్గుతుందని డాక్టర్​ చంద్రావతి సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

శరీరం చెమట కంపు కొడుతోందా? - వాడాల్సింది సెంటు కాదు..!

వేసవిలో చెమట ఇబ్బంది పెడుతోందా ? - అయితే రోజూ ఇలా చేయండి!

ముఖంపై చెమట ఎక్కువ పడుతుందా? జిడ్డుగా కనిపిస్తోందా? ఈ టిప్స్ ఫాలో అయితే టోటల్ సెట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.