Former Additional SP Bhujangarao: మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు పైనా మరో కేసు నమోదైంది. కూకట్‌పల్లిలోని ఓ భూ వివాదంలో కలగజేసుకొని బాధితులను బెదిరించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్ 1007లో గల 340 ఎకరాలకు సంబంధించి నకీలీ పత్రాలను తయారు చేసిన వారికి ఏసీపీగా పనిచేసిన సమయంలో భుజంగరావు సహకరించారని బాధితులు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఎస్ మొయినుద్దీన్, శ్రీనివాస్‌రావు, చలమలశెట్టి అనిల్‌లకు భుజంగరావు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. దీంతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం(Economic Offence Wing) పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు. ఏ4(Accused4)గా నిందితుడు భుజంగరావు పేరును చేర్చారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అనారోగ్యం సమస్యల కారణంగా ఆయన బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయ్యారు.
భూవివాదంలో బాధితులను బెదిరించారు - మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో కేసు
Published : Sep 9, 2024, 5:28 PM IST