మళ్లీ కలకలం రేపుతున్న ఫెడెక్స్ పార్సిల్ మోసాలు - రూ.14.75 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
Published : May 25, 2024, 7:54 PM IST
Fedex Parcel Fraud in Hyderabad : హైదరాబాద్ నగరానికి చెందిన విశ్రాంత మహిళ ఫెడెక్స్ మోసానికి బలైంది. ఓ వీడియో కాల్ ద్వారా తన పేరిట వచ్చిన పార్సిల్లో 5 కిలోల వస్త్రాలతో పాటు 7 నకిలీ పాస్‌పోర్టులు, 5 ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు, 960 గ్రాముల కొకైన్ వచ్చిందని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. ముంబయి క్రైమ్ బ్రాంచ్ నుంచి చేస్తున్నట్లుగా బ్యాంక్ వెరిఫై చేయాలని వివరాలన్నీ సేకరించారు. ఆ తర్వాత బాధితురాలి ఖాతా నుంచి రూ.14,73,400లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ మేరకు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.