national

ETV Bharat / snippets

ఇండిగో, ఖతార్ ఎయిర్ లైన్స్​కు జరిమానా

CONSUMER COURT FINE FOR AIR LINES
AIR LINES (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 12:24 PM IST

ఇండిగో, ఖతార్ ఎయిర్ లైన్స్​కు సంయుక్తంగా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ శ్రీరంగ రావు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి రూ. 3 లక్షల 72 వేలు 45 రోజుల్లోగా ెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే?

2022 జులై 31 వ తేదీన అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్​కో నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఇండిగో, ఖతార్ ఎయిర్ లైన్ సేవలను శ్రీరంగ రావు వినియోగించుకున్నారు. ఆ సమయంలో ఆయన బ్యాగ్​ మిస్​ అవ్వడంతో ఎయిర్​లైన్స్​కు ఫిర్యాదు చేశారు. అయినా వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆయన వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్ ఎట్టకేలకు ఇండిగో, ఖతార్ ఎయిర్ లైన్స్​కు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details