CRDAకి మరింత ఊపు- NDB డైరెక్టర్ జనరల్‌తో సీఎం భేటీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 10:19 PM IST
CM Chandrababu met Director General of New Development Bank:రాజధాని నిర్మాణంతో పాటు సీఆర్డీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఆర్ధిక సాయంపై న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులతో చర్చించినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం ట్వీట్ చేశారు. దిల్లీ పర్యటనకు ముందు సచివాలయంలో ఆ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్‌తో బేటీ అయినట్టు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత రహదారుల అనుసంధానంతో పాటు ఇతర ప్రధాన ప్రాజెక్టులకు ఆర్ధిక సహకారంపై చర్చించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని పోర్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల అంశాలపై కూడా ఎన్డీబీ డైరెక్టర్ జనరల్‌తో చర్చించినట్టు సీఎం చంద్రబాబు పేర్కోన్నారు.