యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం - జకోవిచ్ ఔట్
Published : Aug 31, 2024, 10:18 AM IST
US Open 2024 Novak Djokovic :యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. డిఫెండిగ్ ఛాంపియన్ నోవాక్ జకోవిచ్ మూడో రౌండ్లోనే నిష్క్రమించాడు. 28వ సీడ్ అలెక్సీ పాపిరిన్పై 4-6, 4-6, 6-2, 4-6 తేడాతో ఓటమి చెందాడు. దీంతో 25 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాలనుకున్న జకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. రీసెంట్గా ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన జకోవిచ్‌కు 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఊరిస్తోంది. అంతకుముందు యూఎస్ ఓపెన్‌లో అంచనాలు రేపిన ప్రపంచ మూడో ర్యాంకర్, స్పెయిన్ యంగ్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. 74వ ర్యాంకర్, నెదర్లాండ్స్ ఆటగాడు బోటిక్ వాన్డితో జరిగిన మ్యాచ్‌లో 1-6, 5-7, 4-6 తేడాతో వరుస గేమ్‌ల్లో అల్కరాజ్ ఓటమి పాలయ్యాడు.