Tushar Deshpande Debut:యంగ్ ప్లేయర్ తుషార్ దేశ్పాండే అంతర్జాతీయ క్రికెట్లో శనివారం (జులై 13) అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్లో దేశ్పాండే టీమ్ఇండియా తరఫున బరిలోకి దిగాడు. మ్యాచ్కు ముందు తన భార్యతో కలిసి దేశ్పాండ్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. 'టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ రావడం సంతోషంగా ఉంది. దేశానికి ఆడాలనేది నా చిన్నప్పటి కల. బ్లూ జెర్సీ ధరించడం గర్వంగా ఉంది. ఇక ఐపీఎల్లో చెన్నైకు ఆడిన అనుభవం ఇక్కడ పనికొస్తుందని భావిస్తున్నా. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా బాగుంది' అని తుషార్ తన అన్నాడు.
జింబాబ్వేతో నాలుగో టీ20- అరంగేట్రం చేసిన తుషార్ దేశ్పాండే
Published : Jul 13, 2024, 5:26 PM IST
Tushar Deshpande Debut (Source: Getty Images)
కాగా, 2024 ఐపీఎల్లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తుషార్ బంతితో అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 17 వికెట్లు పడగొట్టి సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికై నేడు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు.