టీమ్ఇండియా కొత్తకోచ్గా గంభీర్- అనౌన్స్మెంటే లేట్!
Published : May 29, 2024, 12:16 PM IST
Team India Coach:టీమ్ఇండియా కొత్త హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దాదాపు ఎంపికైనట్లు తెలుస్తోంది. రీసెంట్గా తాను మెంటార్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో గంభీర్‌ది కీలక పాత్ర అని భావించిన బీసీసీఐ పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఐపీఎల్‌లోని ఓ ఫ్రాంచైజీ ఓనర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. 'గంభీర్ టీమ్ హెడ్ కోచ్‌గా కన్ఫార్మ్ అయ్యాడు. అతడి అపాయింట్మెంట్ను అఫీషియల్‌గా ప్రకటించడమే ఆలస్యం' అని ఓ స్పోర్ట్ న్యూస్ వెబ్సైట్ పేర్కొంది. కానీ, ఈ విషయంపై త్వరలోనే బీసీసీఐ నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
TAGGED:
TEAM INDIA COACH