ETV Bharat / state

ప్రత్యేక కేంద్రాల ద్వారా సన్నాల కొనుగోళ్లు! - ఆ ప్రమాణాల మేరకు ఉంటేనే రూ.500 బోనస్ - special buying centres to fine rice

సన్నాల కొనుగోళ్లలో గోల్​మాల్​ జరగకుండా సర్కార్​ ఫ్లాన్​ - వాటి కోసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు

Super Fine Paddy in Telangana
Super Fine Paddy in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 9:12 AM IST

Super Fine Paddy in Telangana : సన్నాలకు బోనస్​ ఇవ్వనున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లలో గోల్​మాల్​ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు యంత్రాంగం సిద్ధం అవుతోంది. ఒకే కేంద్రంలో సన్న, దొడ్డు బియ్యాలను కొనుగోలు చేస్తే సన్నాలను గుర్తించడం సమస్యగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే సన్నాల కొనుగోలుకు విడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వడ్లలో ఏఏ రకాలకు బోనస్​ వర్తిస్తుందో చెప్పింది. గింజ పొడవు, వెడల్లు నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉంటేనే బోనస్​ రూ.500 వర్తిస్తుంది. వీటిని గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలను అధికారులు కొనుగోలు కేంద్రాలకు పంపిస్తున్నారు.

Super Fine Paddy in Telangana
కేంద్రాలకు తెచ్చిన సన్న వడ్లలో కొన్ని గింజలను తీసుకుని రోలు మాదిరిగా ఉండే ఈ గుండ్రటి చెక్క బాక్సులో పోసి తిప్పుతారు. దీంతో పొట్టు, బియ్యపు గింజలు విడిపోతాయి (ETV Bharat)

దిగుబడి ఆధారంగానే కొనుగోలు కేంద్రాలు : రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం వడ్ల కొనుగోలుకు 7,139 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కేంద్రాల్లో ఎన్నింటిని సన్న వడ్ల కొనుగోళ్లకు కేటాయించాలనే నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఇచ్చిందని పౌర సరఫరాల శాఖ కమిషనర్​ డీఎస్​ చౌహాన్​ తెలిపారు. దిగుబడి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. విస్తీర్ణం ప్రకారం చూస్తే సన్నాల సాగులో నిజామాబాద్​ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత నల్గొండ, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం జిల్లాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

అందుకే నిజామాబాద్​కు 480 కేంద్రాలను ప్రతిపాదించారు. ఇక్కడ ఎనిమిది లక్షల ధాన్యం దిగుబడి వస్తే, ఏడు లక్షలు సన్నాలే ఉంటాయని అధికారుల అంచనా. ఆసిఫాబాద్​ జిల్లాలో 45,329 ఎకరాల్లో వరి సాగు అయితే, అందులో మొత్తం సన్నాలే. దీంతో ఇక్కడ 30 కేంద్రాల్లో సన్నాలే కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సాగు విస్తీర్ణం, దిగుబడి :

  • వరి సాగు - 60.80 లక్షల ఎకరాల్లో
  • దిగుబడి - 146.70 లక్షల టన్నులు(అంచనా)
  • కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం - 91.00 లక్షల టన్నులు(అంచనా)
  • దొడ్డు రకం - 44.00 లక్షల టన్నులు
  • సన్న రకం - 47.00 లక్షల టన్నులు

ప్రమాణాలు : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బోనస్​ వర్తించే 33 రకాలను వ్యవసాయ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ఇవే కాకుండా నిబంధనల మేరకు ఉన్న మిగిలిన రకాలను కూడా సన్నాలుగానే పరిగణిస్తారు.

సన్నాల కొలతలు :

  • గింజ పొడవు 6 మి.మీ. కంటే తక్కువ ఉండాలి.
  • వెడల్పు 2 మి.మీ. కంటే ఎక్కువ ఉండకూడదు.
  • వీటి పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మి.మీ. కంటే ఎక్కువ ఉండాలి.
Super Fine Paddy in Telangana
ఒక బియ్యం గింజను ‘గ్రెయిన్‌ కాలిపర్‌’ అనే ఈ మిషన్‌లో వేసి పొడవు, వెడల్పు కొలుస్తారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉంటే సన్నాలుగా కొనుగోలు చేస్తారు. (ETV Bharat)

రీసైక్లింగ్‌కు అడ్డుకట్ట పడేలా : సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్​ను రాష్ట్ర సర్కారు ఈ వానాకాలం సీజన్​ నుంచి ఇవ్వనుంది. అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసే దొడ్డు, సన్న ధాన్యానికి కనీస మద్దతు ధరను ఎఫ్​సీఐనే చెల్లిస్తోంది. సన్నాల సాగుకు ఖర్చు ఎక్కువ. కానీ దిగుబడి తక్కువ. దీంతో దొడ్డు రకాల సాగుకే రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. రేషన్​ కార్డుల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారుల్లో చాలా మంది ఉపయోగించట్లేదు. ఈ నేపథ్యంలో రైతులను ప్రోత్సహించేందుకు సన్నాల కొనుగోలుకు బోనస్​గా రూ.2,400 కోట్లును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్ ​కార్డులపై సన్న బియ్యం ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బియ్యం రీసైక్లింగ్​ జరగకుండా అడ్డుకట్ట పడేలా ఈ నిర్ణయం దోహదపడనుందని తెలుస్తోంది.

తెల్లరేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్ - జనవరి నుంచి సన్న బియ్యం - MINISTER UTTAM ON RATION RICE

సన్నబియ్యం కొనుగోళ్లపై అసెంబ్లీలో వాడివేడి చర్చ - బీఆర్ఎస్, బీజేపీ లేకుండానే పద్దులకు ఆమోదం - Budget Discussion On Civil Supplies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.