Shreyas Iyer Duleep Trophy 2024:2024 దులీప్ ట్రోఫీలో యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి నిరశపర్చాడు. రెండో రౌండ్ ఇండియా ఎ తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన అయ్యర్ డకౌట్ అయ్యాడు. వన్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ ఏడు బంతులు ఆడి, పరుగులు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 2.4 ఓవర్ వద్ద ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. కాగా, తొలి రౌండ్లో ఇండియా సితో మ్యాచ్‌లో అయ్యర్ (9 పరుగులు), (54 పరుగులు) చేశాడు.
మళ్లీ నిరాశపర్చిన అయ్యర్- ఈసారి డకౌట్
Published : Sep 13, 2024, 12:02 PM IST
Shreyas Iyer Duleep Trophy (Source: Getty Images)
అయితే తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అయ్యర్ ఎదుర్కొంది 44 బంతులే. దీంతో టెస్టుల్లో టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వాలంటే అయ్యర్ మరింత శ్రమించాల్సిదే! ఇకనైనా భారీ ఇన్నింగ్స్‌తో రాణించాల్సిన అవసరం ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 290-10 పరుగులకు ఆలౌటైంది. ఇండియా డి 26 ఓవర్లకు 81-4తో పోరాడుతోంది.