ETV Bharat / entertainment

Jr ఆర్టిస్ట్​గా కెరీర్​ స్టార్ట్- కమల్, సూర్యలాంటి స్టార్లతో స్క్రీన్ షేర్ - Junior Artist Acted With Big Heroes

Junior Artist Acted With Big Heroes : జూనియర్ ఆర్టిస్ట్​గా కెరీర్ ప్రారంభించి అసిస్టెంట్ డెరెక్టర్​గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు కమల్ హాసన్, సూర్య లాంటి పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

Junior Artist Acted With Big Heroes
Junior Artist Acted With Big Heroes (source: ETV Bharat, Getty Images (Middle))
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2024, 3:41 PM IST

Junior Artist Acted With Big Heroes : అతడు ఓ మంచి నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు కూడా. ఇవన్నీ రాత్రికి రాత్రి సాధించినవి మాత్రం కాదు. వీటన్నింటిలో ఎదగడానికి ఆయన ఎన్నో కష్టాలను, ఒడుదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జూనియర్ ఆర్టిస్ట్​గా కెరీర్ ప్రారంభించిన అతడు ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్​గా కూడా పనిచేశాడు. 2018లో విడుదలైన 'జోసెఫ్' చిత్రంలో ఇతడి నటన అందరినీ మెచ్చుకునేలా చేసింది. అతడెవరో ఇప్పటికే మీకు అర్థమయ్యిందా? మనం చెప్పుకుంటుంది జోజు జార్జ్ గురించే.

కేరళకు చెందిన జోజు జార్జ్ అసలు జోసెఫ్ జార్జ్. కుజూర్​లో స్కూలింగ్ చదివిన ఇతడు ఇరింజలకుడలో డిగ్రీ పట్టభద్రుడయ్యాడు. 1995లో 'మజవిల్కూదరం' అనే సినిమాతో జూనియర్ ఆర్టిస్ట్​గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జోజు తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేశాడు. ఆ తర్వాత అంటే 2000 ఏడాది నుంచీ మలయాళ చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు. 2010నాటికి జార్జ్​కు యాక్షన్ హీరో బిజు, టేక్ ఆఫ్, త్రివేండ్రం లాడ్జ్ వంటి పెద్ద సినిమాల్లో కీలకమైన పాత్రలు రావడం మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా 2015లో నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన జోజు 'చార్లీ' వంటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. అప్పట్లో 'చార్లీ' సినిమా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను కైవసం చేసుకుంది. తర్వాత 'అప్పు పాతు పప్పు ప్రొడక్షన్స్' పేరుతో జార్జ్ ప్రొడక్షన్ కంపెనీని కూడా ప్రారంభించాడు.

అయితే ఎన్ని పాత్రల్లో కనిపించినా జోజుకు బ్రేక్ ఇచ్చింది మాత్రం 2018లో విడుదలైన 'జోసెఫ్' చిత్రమనే చెప్పుకోవాలి. ఎమ్ పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోజు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా కమర్షియల్​గా కూడా బాగా హిట్ అయ్యింది. ఇందులో జోజు నటన, హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందుకు గానూ ఆయన నేషనల్ ఫిల్మ్ అవార్డులో ప్రత్యేక ప్రస్తావన కూడా దక్కించుకున్నాడు.

ప్రస్తుతం జోజు చేతిలో బడా హీరోల సినిమాలు రెండున్నాయి. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న 'సూర్య44' చిత్రంలో జోజు స్టార్ హీరో సూర్యతో కలిసి తెరమీద కనిపించనున్నారు. మరోవైపు మణిరత్నం డైరెక్షన్​లో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న 'థగ్ లైఫ్' సినిమాలోనూ జోజు కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఇక జోజు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 2008లో అబ్బా అనే అమ్మాయితో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

సినీ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌-రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసేయండి - Movie Ticket price for Rs 99

చిన్న సినిమాలతో భారీ సక్సెస్ - ఈ వారం థియేటర్లలో అదరగొట్టిన చిత్రాలివే! - Latest movies with low budget

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.