national

ఫైనల్స్​లో ఊహించని ముగింపు - బైల్స్​కు దక్కని చివరి స్వర్ణం

By ETV Bharat Sports Team

Published : Aug 6, 2024, 9:19 AM IST

Paris Olympics Gymnastics
Simone Biles Paris Olympics 2024 (Associated Press)

Simone Biles Paris Olympics 2024 :పారిస్‌ వేదికగా జరిగిన ఆర్టిస్టిక్​ జిమ్నాస్టిక్స్​లోని వివిధ ఈవెంట్స్​లో ఇప్పటికే మూడు స్వర్ణాలు (టీమ్, ఆల్‌రౌండ్, వాల్ట్‌), ఓ రజతం ఖాతాలో వేసుకుంది జిమ్నాస్టిక్‌ స్టార్‌ సిమోన్‌ బైల్స్‌. అయితే సోమవారం జరిగిన రెండు ఫైనల్స్‌లోనూ ఆమె ఒక్క స్వర్ణం కూడా సాధించలేకపోయింది. బ్యాలెన్స్‌ బీమ్‌ పోటీల్లో కిందపడి కాంస్యం కూడా సొంతం చేసుకోలేకపోయింది.

దీంతో 13.100 స్కోరుతో అయిదో స్థానంలో నిలిచింది. ఎలీస్‌ (ఇటలీ- 14.366), యాకిన్‌ (చైనా- 14.100), మనీల (ఇటలీ- 14) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు.

మరోవైపు ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో బైల్స్‌ రజతంతోనే సరిపెట్టుకుంది. 14.133 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఈవెంట్​లో రెబెకా (బ్రెజిల్‌- 14.166) స్వర్ణం, చైల్స్‌ (అమెరికా- 13.766) కాంస్యం నెగ్గారు.

ABOUT THE AUTHOR

...view details