Motorola Edge 50 Neo Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా మరో సరికొతత్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎడ్జ్ సిరీస్‌లో ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఎడ్జ్ 50 అల్ట్రా వంటి ఫోన్లను ఇది వరకే లాంచ్ చేయగా.. తాజాగా ఎడ్జ్ 50 నియో మొబైల్‌ను రిలీజ్ చేసింది. మోటోరోలా ఈ మొబైల్లో తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోటో ఏఐ సూట్‌ను అందిస్తోంది.
సెప్టెంబర్ 16 సాయంత్రం 7 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నట్లు మోటోరోలా తెలిపింది. సెప్టెంబర్ 24 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో ఈ కొత్త మొబైల్స్ విక్రయాలు జరుగుతాయని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై రూ.1,000 డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌పై అదనంగా మరో రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. రిలయన్స్ జియోతో పాటు రూ.10వేలు విలువైన ప్రయోజనాలను బండిల్డ్ ఆఫర్ కింద అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు మీకోసం.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫీచర్లు:
- ప్యానెల్: 6.4 అంగుళాల ఫ్లాట్ ఎల్‌టీపీఓ పీఓల్‌ఎఈడీ
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్‌సిటీ 7300
- 1.5K రిజల్యూషన్ కలిగిన స్క్రీన్
- 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
- మెయిన్ కెమెరా: 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ
- యాంగిల్ కెమెరా: 13 ఎంపీ అల్ట్రా వైడ్
- టెలిఫొటో లెన్స్: 10 ఎంపీ
- బ్యాటరీ: 4310 ఎంఏహెచ్
- 68W టర్బో పవర్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
వేరియంట్స్: ఎడ్జ్ 50 నియో కేవలం సింగిల్ వేరియంట్‌లో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది.
- 8జీబీ+256 జీబీ వేరియంట్
Sleek, durable, and MIL-810H certified, the #MotorolaEdge50Neo shines with Sony - LYTIA™ 700C, Adaptive Stabilization, and Pantone colors. 📱✨
— Motorola India (@motorolaindia) September 16, 2024
Launched with 8+256GB at ₹22,999/-, sale starts 24 Sep @Flipkart, https://t.co/YA8qpSXba4 & leading stores.#ReadyForAnything
కలర్ ఆప్షన్స్:
- పాంటోన్-సర్టిఫైడ్ నాటికల్ బ్లూ
- లాట్టే
- గ్రిసైల్
- పోయిన్సియానా వేగన్ లెదర్ ఎండ్
- ధర: రూ.23,999
సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఈ మొబైల్లో మోటోరోలా తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోటో ఏఐ సూట్‌ను అందిస్తోంది. ఈ మోటో ఏఐ సూట్ సాయంతో ఫొటో ప్రాసెసింగ్, స్టైల్ సింక్, అడాప్టివ్ స్టెబిలైజేషన్ 30ఎక్స్ సూపర్ జూమ్ వంటి కెమెరా ఫీచర్లు ఈ కొత్త ఫోన్లో పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తున్న దీనికి ఐదేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని మోటోరోలా చెబుతోంది.
ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి వివో టీ3 అల్ట్రా- ధర ఎంతంటే? - Vivo T3 Ultra Launched
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త- కేవలం రూ.7,999లకే శాంసంగ్ మొబైల్! - Samsung Galaxy M05 Launched