national

పారిస్ ఒలింపిక్స్​ : లక్ష్యసేన్​ విజయం రద్దు - ఎందుకంటే?

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 6:56 AM IST

source Associated Press
Lakshya Sen (source Associated Press)

Paris Olympics 2024 Lakshyasen : పారిస్​ ఒలింపిక్స్​2024 బ్యాడ్మింటన్​ మెన్స్ సింగిల్స్‌ గ్రూప్‌ స్టేజ్‌లో లక్ష్యసేన్(21-8, 22-20) విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా విజయాన్ని రద్దు చేసినట్లు తెలిసింది. ఎందుకంటే ఈ మ్యాచ్​లో లక్ష్య సేన్​తో తలపడిన కెవిన్ కార్డోన్​ లెఫ్ట్ ఎల్​బో గాయం వల్ల ఈ ఒలింపిక్స్​ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తెలిపింది.

"కెవిన్​ గాయం వల్ల ఈ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. మిగిలిన గ్రూప్​ ఎల్​ మ్యాచెస్​ ఆడడు. దీంతో మ్యాచెస్ రీషెడ్యూల్ అయ్యాయి. గ్రూప్ స్టేజ్​లో BWF జనరల్ కాంపిటీషన్ రెగ్యులేషన్స్ ప్రకారం, గ్రూప్ Lలో కార్డోన్‌తో ఆడిన లేదా ఇంకా ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల ఫలితాలను పరిగణలోకి తీసుకోవట్లేదు" అని స్పోర్ట్స్ గ్లోబల్ గవర్నింగ్ బాడీ తెలిపింది. దీంతో ఇప్పుడు లక్ష్యసేన్ తన తర్వాతి రెండు మ్యాచుల్లో సోమవారం Carraggiతో బుధవారం క్రిస్టితో తలపడాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details