Paris Olympics India Hockey:పారిస్ ఒలింపిక్స్‌లో భారత పరుషుల హాకీ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం బెల్జియంతో జరిగిన పూల్- B మ్యాచ్‌లో టీమ్ఇండియా 1-2 తేడాతో ఓడింది. అయితే ఫస్ట్ హాఫ్‌లో 1-0తో లీడ్‌లో ఉన్న భారత్‌కు సెకండ్ హాఫ్‌లో బెల్జియం నుంచి గట్టి పోటీ ఎదురైంది. సెకండ్ హాఫ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన బెల్జియం 2 గోల్స్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకొని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
భారత హాకీ జట్టుకు తొలి ఓటమి- హర్మన్‌సేనకు షాకిచ్చిన బెల్జియం!
Published : Aug 1, 2024, 3:35 PM IST
Paris Olympics India Hockey (Source: Associated Press)
కాగా, రెండు విజయాలు, ఓ డ్రాతో భారత్ ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరుకుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ (3-2)పై నెగ్గగా, అర్జెంటీనాతో 1-1తో డ్రా చేసుకుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇక భారత్ ఆగస్టు 2న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.