Paris 2024 Olympics Triathlon :పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా జరగాల్సిన స్విమ్మింగ్ ట్రైయాథ్లాన్ తొలి ట్రైనింగ్ సెషన్‌ను తాజాగా అక్కడి నిర్వాహకులు రద్దు చేశారు. ప్రసిద్ధ సెన్ నదిని కాలుష్యం చుట్టుముట్టిన కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఒలింపిక్స్ అభిమానులకు షాకింగ్ న్యూస్ : ఆ వాటర్ ఈవెంట్లో మార్పులు!
Published : Jul 28, 2024, 12:16 PM IST
"సెన్ నదిలోని నీటి క్వాలిటీని దృష్టిలో ఉంచుకుని మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అందుకోసమే ట్రైయాథ్లాన్ ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేస్తున్నాం. అథ్లెట్ల ఆరోగ్యంపై మేము ప్రత్యేక శ్రద్ధతో ఉన్నాం. ఆ నది నాణ్యతను మరోసారి చెక్ చేస్తాం. అయితే ఎప్పుడు పర్మిషన్ ఇస్తామనేది ఇప్పుడే చెప్పలేం" అని నిర్వాహకులు తెలిపారు.
జులై 30న ఈ పోటీలు ప్రారంభం కానుందున ఒకవేళ అప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే ఒలింపిక్స్ మేనేజ్మెంట్ వద్ద ప్లాన్ B ఉన్నట్లు తెలుస్తోంది. పోటీలను కొద్దిరోజులకు వాయిదా వేయడం లేకుంటే మారథాన్ స్విమ్మింగ్‌ను పారిస్‌కు తూర్పు దిక్కున ఉన్న మార్నె రివర్‌లో నిర్వహించడానికి ప్లాన్ చేయనున్నారట.