national

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 9:43 PM IST

ETV Bharat / snippets

లాస్ట్ గేమ్ ఆడేసిన సునీల్ ఛెత్రి- 19ఏళ్ల కెరీర్​కు ఎండ్ కార్డ్

Sunil Chhetri Last Match
Sunil Chhetri Last Match (Source: Getty Images)

Sunil Chhetri Last Match:భారత ఫుట్​బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి తన కెరీర్​లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఫిఫా 2026 వరల్డ్​కప్ క్వాలిఫయర్స్​లో భాగంగా కువైట్​తో గురువారం జరిగిన మ్యాచ్​తో 19ఏళ్ల ఛెత్రి కెరీర్ ముగిసింది. మ్యాచ్ అనంతరం ఛెత్రికి ప్రేక్షకులు గ్రాండ్​గా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆ సమయంలో సునీల్ కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక అంతర్జాతీయ కెరీర్​ నుంచి తప్పుకుంటున్నట్లు ఛెత్రి ఇటీవల ప్రకటించాడు. 2005లో ఇంటర్నేషనల్ ఫుట్​బాల్​లో కెరీర్ ప్రారంభించిన ఛెత్రి భారత్ తరఫున 95 గోల్స్ ​చేశాడు. కాగా, వరల్డ్​వైడ్​గా అత్యధిక గోల్స్​ చేసిన లిస్ట్​లో క్రిస్టియానో రొనాల్డో (128 గోల్స్), అలీ డే (108), మెస్సీ (106) తర్వాత ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details