national

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 9:37 AM IST

ETV Bharat / snippets

టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి - ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు!

source Getty Images
First Triple Super Over (source Getty Images)

First Triple Super Over : టీ20ల్లో ఒక సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ ఆడటమే చాలా అరుదు. అలాంటిది ఒక మ్యాచ్‌‌‌‌లో ఏకంగా మూడు సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లు పడ్డాయి. కర్నాటకలో జరుగుతున్న మహారాజా టీ20టోర్నీ దీనికి వేదికైంది. హుబ్లీ టైగర్స్‌‌‌‌‌‌‌‌, బెంగళూరు బ్లాస్టర్స్‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగిన మ్యాచ్‌‌‌‌ మూడు సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లకు దారి తీసింది.

మొదట హుబ్లీ నిర్ణీత 20ఓవర్లలో 164 ‌‌‌‌పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు కూడా 20ఓవర్లలో 164 పరుగులే చేసింది. దీంతో తొలి సూపర్​ఓవర్‌‌‌‌‌‌‌‌ నిర్వహించగా బెంగళూరు 10/1 స్కోరు, హుబ్లీ 10/0 స్కోరు చేసింది. మళ్లీ రెండో సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా బెంగళూరు 8/0, హుబ్లీ 8/1 స్కోరు చేశాయి. అనంతరం మూడోసారి సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌ వేయగా బెంగళూరు 12/1 స్కోరు చేయగా, హుబ్లీ 13/1 స్కోరు చేసి థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. టీ20క్రికెట్ చరిత్రలో ఇలా మూడు సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లు ఆడటం ఇదే తొలిసారి.

ABOUT THE AUTHOR

...view details