Alcaraz vs Djokovic 2024:2024 వింబుల్డన్ ఆఖరి దశకు చేరుకుంది. అందరూ ఆశించినట్లే అత్యుత్తమ ఆటగాళ్లే టైటిల్ పోరులో నిలిచారు. జులై 14న నొవాక్ జకోవిచ్ (సెర్బియా)- అల్కరాస్ (స్పెయిన్) ఫైనల్ ఫైట్‌లో తలపడనున్నారు. 7సార్లు ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, గతేడాది విజేత కార్లోస్ అల్కరాస్ అదిరే ఆటతో ఫైనల్లోకి దూసుకొచ్చారు. మరి జకోవిచ్ 8వ వింబుల్డన్ టైటిల్ నెగ్గుతాడా? అల్కరాస్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలుపుకుంటాడా? అనేది ఆదివారం తేలిపోనుంది.
వింబుల్డన్ ఫైనల్‌కు జకోవిచ్, అల్కరాస్- పంతం నీదా నాదా సై!
Published : Jul 13, 2024, 11:04 AM IST
Alcaraz vs Djokovic 2024 (Source: Associated Press)
ఈ స్టార్ ప్లేయర్లు ఇప్పటిదాకా 5ఈవెంట్లలో తలపడ్డారు. ఈ 5సార్లు కూడా ఇద్దరి మధ్య టఫ్‌ఫైట్ జరిగింది. కాగా, అందులో 3సార్లు జకోవిచ్ నెగ్గగా, 2సార్లు అల్కరాస్ విజయం సాధించాడు. ఇక వింబుల్డన్‌లో గతేడాది కూడా ఈ ఇద్దరి మధ్యే ఫైనల్ జరిగింది. ఇందులో 7సార్లు ఛాంపియన్ జకోవిచ్‌పై 1-6, 7-6, 6-1, 3-6, 6-4తేడాతో అల్కరాస్ తొలిసారి టైటిల్ ముద్దాడాడు. మరి ఈసారి ఎవరిది పైచేయి కానుందో?