national

శ్రీవారి భక్తులకు బ్యాడ్​న్యూస్​ - వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో వారికి గదుల కేటాయింపు రద్దు!

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 11:03 AM IST

No Accommodation for Donors
No Accommodation for Donors (ETV Bharat)

No Accommodation for Donors: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వాహన సేవలు ఉంటాయి. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో గదుల కేటాయింపుపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే సాధారణ యాత్రికులకు మరిన్ని వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో.. బ్రహ్మోత్సవాల సమయంలో వివిధ ట్రస్ట్‌లు, స్కీమ్‌ల దాతలకు వసతి బ్లాక్ చేసినట్లు తెలిపింది. అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా దాతలకు అందుబాటులో ఉన్న ప్రత్యేకాధికారాల ప్రకారం దర్శనానికి అనుమతిస్తారని.. దాతలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details