ETV Bharat / state

ఐ ఫోన్లు ఓపెన్ కాకపోవడంతో డేటా డిలీట్ చేయాలని చూశారు : ముంబయి నటి - Actress Jetwani in AP Secretariat

author img

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Mumbai Actress Jethwani Meet Home Minister Anita: తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఏపీ రాష్ట్ర హోంమంత్రి అనితను కోరినట్లు ముంబయి నటి కాదంబరీ జెత్వానీ తెలిపారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చొరవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

MUMBAI ACTRESS CASE
ACTRESS JETWANI IN AP SECRETARIAT (ETV Bharat)

Mumbai Actress Jethwani Meet Home Minister Anitha : తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఏపీ హోంమంత్రి అనితను కోరినట్లు ముంబయి నటి కాదంబరీ జెత్వానీ తెలిపారు. సెక్రటేరియట్​లో అనితను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన తల్లిదండ్రులు, న్యాయవాదితో హోంమంత్రిని కలిశామని అన్నారు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టారని వివరించానని అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై తీవ్రమైన పోరాటం చేశామన్నారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

తనకు మానసికంగా, భౌతికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని, దానికి పరిహారం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చొరవకు జెత్వానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో రాజకీయ జోక్యం ఎంత ఉందనేది తనకు తెలియదని, అంతా విచారణలో తేలుతుందని అన్నారు. ముంబయిలో ఉన్న కేసు విషయంలో అక్కడ తేల్చుకుంటానని తెలిపారు. నా ఐ ఫోన్​లు 2 సార్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారని, దానికి సంబంధించిన అలర్ట్​లు వచ్చాయని జెత్వానీ పేర్కొన్నారు.

కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు - సీఎంఓలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర - Mumbai Actress Case Updates

పెద్ద నాయకుల హస్తం ఉంది : ఐ ఫోన్లు ఓపెన్ చేయడం కుదరకపోవడంతో, అందులో ఉన్న డేటా డిలీట్ చేయాలని చూశారని జెత్వానీ తెలిపారు. ఈ కేసులో న్యాయం జరగాలని కోరారు. భారత దేశ చరిత్రలో ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్న కేసులను ఇప్పటి వరకు చూడలేదని ఆమె అన్నారు. కొందరు రాజకీయ పెద్దలు పేర్లు ఇందులో ఉన్నాయని చెప్పారు. మెయిల్​లో అలర్ట్ వచ్చిందని ఐ ఫోన్​లో సూపర్ సెక్యూరిటీ ఉండటం వల్ల ఓపెన్ చేయలేకపోయారని వివరించారు. 23 రోజులు బెయిల్ రాలేదంటే, ఈ కేసులో ఎంత అధికార దుర్వినియోగం ఉందో అర్థం చేసుకోవచ్చని వాపోయారు.

ఎఫ్‌ఐఆర్‌ 490/2024లోని ఏ1 విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేయాలి. మేము కేసు పెట్టిన వారికి వ్యతిరేకంగా పోరాడటం వల్ల మాకు ప్రమాదం ఉంది. అందుకే మేము ఇక్కడ ఉన్నప్పుడు రక్షణ కల్పించాలని కోరాం. అనిత గారు చాలా ఓపిగ్గా నా వినతులన్నీ స్వీకరించారు. గత ప్రభుత్వంలో మాపై జరిగిన అన్యాయం, ఘోరమైన దాడులకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మాకు హామీ ఇచ్చారు. - కాదంబరి జెత్వానీ, ప్రముఖ నటి

రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్టు చేయడం దారుణం: కేటీఆర్

నన్ను తీసుకొచ్చింది ఈ పోలీసే - నటి కాదంబరి అరుపులు - Kadambari Jethwani Fires on SI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.