Vemulawada Sri Raja RajeswraSwamy Temple Rush Today : వేములవాడలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్న అనంతరం దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో అభిషేకాలు, ఆర్జిత పూజా సేవలను రద్దు చేశారు. అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల ఏర్పాట్లను ఆలయ ఈవో వినోద్ రెడ్డి పరిశీలించారు.
వేములవాడ రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు - దర్శనానికి 3 గంటల సమయం
Published : Aug 12, 2024, 2:04 PM IST