Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఏటా శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణస్వామివారిని సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. అలాగే ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై మాఢ వీధులలో విహరిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక- ఆ రోజున తిరుమలలో పలు సేవలు రద్దు!
Published : Aug 24, 2024, 1:07 PM IST