Published : Jun 23, 2024, 10:19 PM IST
రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష ఉపనాయకుడిగా వద్దిరాజు రవిచంద్ర
BRS Rajya sabha Deputy Leader vaddiraju Ravichandra :రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష ఉపనాయకుడిగా వద్దిరాజు రవిచంద్ర, విప్‌గా దీవకొండ దామోదర్ రావులను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. బీసీ వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా, విప్‌గా దీవకొండ దామోదర్ రావులను నియమించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు, బీసీలతో పాటు అన్ని వర్గాల శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆశీస్సులతో రాజ్యసభకు వద్దిరాజు రవిచంద్ర తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పక్ష ఉపనాయకులు, విప్ ల నియామకం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.