ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ కార్యాలయంపై దాడి- అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 7:58 PM IST
HC on YSRCP Leaders Bail Petition:టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. టీడీపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఉద్దేశ పూర్వకంగా పక్కా ప్రణాళికతోనే కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 14కి వాయిదా వేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు.