Telangana 10th Exam Fee Payment Dates Finalised : పదో తరగతి (10th Exams) పరీక్ష రుసుం చెల్లింపు తేదీలను తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు వెల్లడించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించుకునేందుకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు చెల్లించుకోవచ్చని సంచాలకులు ప్రకటనలో పేర్కొన్నారు.
ఫీజు చెల్లించే గడువు ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తి లేదని సంచాలకులు స్పష్టం చేశారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి 125 రూపాయలు పరీక్ష రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది. మూడు, అంతకంటే తక్కువ సబ్జెక్టులకు 110 రూపాయలు, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల కంటె ఎక్కువ ఉంటే 124 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ విద్యార్థులు 125 రూపాయలతో పాటు మరో 60 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
2025 మార్చిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులు ఇప్పటికే ప్రిపరేషన్లు గట్టిగా చేస్తున్నారు. జనవరి నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యాలు ప్రకటించాయి.
ఏ మాధ్యమంలో ఉంటుందో?- పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో గందరగోళం