ETV Bharat / state

పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో కీలకమైన పనులు ప్రారంభం

పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో కీలకమైన పనులు ప్రారంభం - టర్బైన్ల ఏర్పాటులో స్టే రింగ్‌లు అమరిక

stay_rings_work_at_polavaram
stay_rings_work_at_polavaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 7:25 PM IST

Stay Rings Work Started at Polavaram Hydropower Station: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో టర్బైన్​ల ఏర్పాటులో కీలకమైన స్టే రింగ్​ల అమరిక పనులు ప్రారంభమయ్యాయి. ఈ స్టే రింగ్​ల అమరికకు 320 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన క్రాలర్ క్రేన్ వినియోగిస్తున్నారు. స్టే రింగ్ అమరిక పనుల ప్రారంభం సందర్భంగా జరిగిన పూజ కార్యక్రమంలో పోలవరం జల విద్యుత్ కేంద్రం ఏపీ జెన్​కో ఎస్ఈ రామ భద్రరాజు, ఈఈ వై భీమా ధన రావు, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర, ఎలక్ట్రో మెకానికల్ విభాగం సీనియర్ మేనేజర్ మణికంఠ పాల్గొన్నారు. ప్రాజెక్ట్​లో ఈ స్టే రింగ్​లు కీలక పాత్ర పోషిస్తాయి.

ఒక్కో స్టే రింగ్ 4 విభాగాలుగా ఉంటుంది. దీని బరువు 136 మెట్రిక్ టన్నులు. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే కప్లాన్ టర్బైన్​లు సమర్ధవంతంగా పనిచేయటంలో ఈ స్టే రింగ్​లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రాజెక్ట్​లో కీలకమైన నిర్మాణ పనులు దీని అమరిక తరువాత కొనసాగిస్తారు. ఈ సందర్భంగా ఎస్​ఈ రామభద్ర రాజు మాట్లాడుతూ జల విద్యుత్ కేంద్రంలో స్టే రింగ్​ల ఏర్పాటు తరువాతే టర్బైన్​ల అమరిక చేపడతారని తెలిపారు. ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం కాకుండా ఉండేందుకు అన్ని పనులు సమాంతరంగా చేస్తున్నట్లు తెలిపారు. నిర్దేశించిన సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర తెలిపారు.

పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ - నిపుణుల బృందం నిర్ణయం

2028 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి - అధికారులకు చంద్రబాబు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.