కిమ్‌కు పుతిన్ స్పెషల్ రిటర్న్ గిఫ్ట్ - ఏమిచ్చారంటే?
Published : Sep 2, 2024, 7:25 AM IST
Putin Gifted 24 Horses To Kim :రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్‌కు 24 మేలిమి జాతి గుర్రాలను కానుకగా ఇచ్చారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ, ఉత్తర కొరియా తమకు ఆయుధాలను సరఫరా చేసినందుకు కృతజ్ఞతగా ఈ రిటర్న్గిఫ్ట్ను పంపినట్లు తెలుస్తోంది. గతంలో పంగ్సన్ అనే తెల్లటి వేట జాగిలాలను పుతిన్‌కు కిమ్ కానుకగా ఇచ్చారు. తరువాత పుతిన్, కిమ్‌కు ఆరుస్ లిమోసిన్ కారును బహూకరించారు. ఇరువురు దేశాధినేతలు ఈ కారులో కొద్దిసేపు షికారు కూడా చేశారు. తాజాగా 24 ఓర్లోవ్ ట్రోటర్ జాతికి చెందిన గుర్రాలను కిమ్‌కు పుతిన్ బహూకరించారు. వీటిలో 19 మగ గుర్రాలు (స్టాలియన్లు), 5 ఆడ గుర్రాలు ఉన్నాయి. ఈ జాతి గుర్రాలంటే కిమ్‌కు ఎంతో ఇష్టమట. వీటిని ఉత్తర కొరియా వారసత్వానికి ప్రతీకలుగా భావిస్తారు.