Modi Ukraine Visit: ప్రధాని నరేంద్రమోదీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. పోలండ్ పర్యటన ముగించుకున్న మోదీ, రైల్లో 10 గంటలు ప్రయాణించి కీవ్ చేరుకున్నారు. 1991లో ఉక్రెయిన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. కీవ్ రైల్వేస్టేషన్‌లో మోదీకి ఘనస్వాగతం లభించింది. తర్వాత మోదీ హయత్ హోటల్‌లో భారత సంతతివారిని కలుసుకున్నారు.
పది గంటల ట్రైన్ జర్నీతర్వాత ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ - జెలెన్‌స్కీతో శాంతి చర్చలు!
Published : Aug 23, 2024, 12:11 PM IST
శుక్రవారం నేషనల్ మ్యూజియంలోని మల్టీమీడియా మార్టిరోలాజిస్ట్‌ను సందర్శించి, యుద్ధంలో బలైన చిన్నారులకు మోదీ నివాళి అర్పిస్తారు. ఫోమిన్ బొటానికల్ గార్డెన్‌లోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత మారిన్‌స్కీ ప్యాలెస్‌కు వెళ్తారు. అక్కడ జెలెన్‌స్కీతో భేటీ అయ్యి ద్వైపాక్షిక సహకారంపై చర్చించనున్నారు. ఇంతకుముందు రష్యాలో పర్యటించిన ప్రధానిపై అమెరికా, పశ్చిమ దేశాలు విమర్శలు గుప్పించాయి. దీనితో యుద్ధంలో భారత్ ఏ పక్షానికీ మద్దతుగా ఉండదని, కేవలం శాంతికి మాత్రమే వారధిగా పని చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు.