Biden Trump Meeting : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ బుధవారం ఓవల్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శ్వేతసౌధం (వైట్‌హౌస్) వర్గాలు శనివారం తెలిపాయి. అమెరికాలో ప్రెసిడెన్సియల్ ఎలక్షన్స్ పూర్తయిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు, త్వరలో ప్రమాణం చేయనున్న అధ్యక్షుడికి ఆతిథ్యం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగానే జో బైడెన్, ట్రంప్‌నకు ఓవల్ ఆఫీస్‌లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. అయితే 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ట్రంప్, అప్పుడు గెలుపొందిన డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి అయిన జో బైడెన్‌కు అతిథ్యం ఇవ్వకపోవడం గమనార్హం.
త్వరలో భేటీ కానున్న ట్రంప్, బైడెన్ - కారణం అదే!
Published : Nov 9, 2024, 10:42 PM IST