తెలంగాణ

telangana

ట్రంప్ పార్టీ కన్వెన్షన్ సమీపంలో వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు - అమెరికాలో టెన్షన్ టెన్షన్

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 9:48 AM IST

Out-of-state officers fatally shot a man blocks away from the RNC
Ohio police fatally shoot man (Associated Press)

Knife-wielding Man Shot Dead Near RNC : రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సదస్సు జరుగుతున్న అమెరికాలోని మిల్వాకీలో కత్తితో ఉన్న ఓ వ్యక్తిని ఒహియో పోలీసులు కాల్చి చంపారు. పార్టీ సదస్సు జరుగుతున్న ప్రదేశానికి 2 మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలిలో రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు మిల్వాకీ పోలీసు చీఫ్ జెఫ్రీ నార్మన్ తెలిపారు. కాల్పుల ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే రాష్ట్రాల వ్యక్తులు ఇక్కడ ఎలా కాల్పులు జరుపుతారని స్థానిక పోలీసులను ప్రశ్నించారు. మరోవైపు, మిల్వాకీ వాసులు, స్వచ్ఛంద కార్యకర్తలు షూటింగ్‌ జరిగిన ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. పార్టీ సదస్సు కారణంగా పోలీసుల ప్రమేయంపై అసహనం వ్యక్తం చేశారు. కాగా, మిల్వాకీలో సోమవారం ప్రారంభమైన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు గురువారంతో ముగియనుంది. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్​పై కాల్పుల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details