తెలంగాణ

telangana

ETV Bharat / snippets

ఇరాన్​ అధ్యక్ష ఎన్నికల్లో పెజెష్కియన్ విజయం - సంస్కరణవాదికే పట్టం కట్టిన ప్రజలు!

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 10:06 AM IST

Iran Presidential Election 2024 Results
Iran Presidential Election 2024 Results (Associated Press)

Iran Presidential Election 2024 Results :ఇరాన్​ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదిగా గుర్తింపుపొందిన మసౌద్ పెజెష్కియన్ తన సమీప ప్రత్యర్థి, అతివాది అయిన సయీద్​ జలీలిపై విజయం సాధించారు. వాస్తవానికి జూన్​ 30న మొదటిసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. కానీ అప్పుడు ఏ అభ్యర్థికి కూడా 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. దీనితో శుక్రవారం మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఈ పోలింగ్​లో మొత్తం 30 కోట్ల మంది ఓటర్లలో, 1.63 కోట్ల మంది పెజెష్కియన్​కు, 1.35 కోట్ల మంది జలీలికి అనుకూలంగా ఓట్లు వేశారు. గత కొన్నేళ్లుగా ఇరాన్‌ ఎదుర్కొంటున్న ఆంక్షలు, ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఈసారి పెజెష్కియన్​కు పట్టం కట్టారు. మే 19 నాటి హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందిన నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.

ABOUT THE AUTHOR

...view details