తెలంగాణ

telangana

నువ్వు వారియర్ - నీకోసం ప్రార్థిస్తుంటాను : సమంత

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 5:04 PM IST

source ETV Bharat
Samantha (source ETV Bharat)

Samantha Hina khan Breast Cancer Surgery : తాను స్టేజ్‌ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవలే ప్రముఖ నటి హీనా ఖాన్‌ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో సినీఇండస్ట్రీలోని పలువురు ప్రముఖలు ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ అండగా నిలుస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత కూడా అదే చేసింది. "నీకోసం నేను ప్రార్థిస్తాను. ధైర్యంగా ఉండు" అంటూ చెప్పుకొచ్చింది. దానికి వారియర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించింది. దీనిపై హీనా కూడా స్పందించింది. "సమంత నువ్వు అన్నింటిలోనూ స్టార్‌. జీవితం విసిరిన ఛాలెంజె​స్​ను హ్యాండిల్ చేసిన విధానం సూపర్. మీ గురించి తెలుసుకుని ఎంతో స్ఫూర్తి పొందాను. మీ ప్రేమకు నా ధన్యవాదాలు" అని బదులిచ్చింది.

కాగా, సమంత త్వరలోనే సిటాడెల్ వెబ్​సిరీస్​తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అలానే దర్శకద్వయం రాజ్​ అండ్ డీకే మరో సిరీస్​కు కూడా గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టేందుకు రెడీ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details