Double Ismart Trailer:ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ట్రైలర్ ఆదివారం (ఆగస్టు 4) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ విశాఖపట్టణంలో గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఇదే కార్యక్రమంలో సాయంత్రం 6.30 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. దీంతో రామ్ ఫ్యాన్స్ వైజాగ్ నగరాన్ని రంగురంగుల లైట్లు, భారీ ప్లెక్సీలతో గ్రాండ్‌గా ముస్తాబు చేశారు. ఈ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'డబుల్ ఇస్మార్ట్'- మాస్ ట్రైలర్ లోడింగ్- ఈవెంట్ ఎక్కడంటే?
Published : Aug 4, 2024, 10:02 AM IST
Double Ismart Trailer (Source: ETV Bharat)
కాగా, ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రామ్‌కు జోడీగా కావ్యా థపర్ నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.