India vs Bangladesh 2024 : మరో రెండు రోజుల్లో భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని బంగ్లా బౌలర్లు ఎలా అడ్డుకుంటారనే దానిపై అందరీ దృష్టి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతడు మరోసారి ఫుల్ ఫామ్‌లోకి వస్తే బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు. దీంతో నహీద్ రాణా, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్ వంటి బంగ్లా బౌలర్లు విరాట్ దూకుడును అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
నహీద్ రానా : ది పేస్ సెన్సేషన్ - బంగ్లా పేసర్ నహీద్ రానా గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ సంధిస్తాడు. తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సమర్థుడు కూడా. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అదరగొట్టాడు. షార్ట్ పిచ్ బంతులు, బౌన్సర్లతో విరాట్‌ను నహీద్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే విరాట్‌కు నహీద్ మంచి స్పీడ్‌తో లైన్ అండ్ లెంగ్త్ బంతులను సంధించేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ బంతులను కోహ్లీ డిఫెన్స్ ఆడితే ఎడ్జ్ తీసుకుని ఔట్ అయ్యే అవకాశం ఉంది.
తస్కిన్ అహ్మద్ : ది స్వింగ్ మాస్ట్రో - బంగ్లా మరో పేసర్ తస్కిన్ అహ్మద్‌ను ది స్వింగ్ మాస్ట్రోగా పిలుచుకుంటారు అభిమానులు. అంతలా బంతిని స్వింగ్ చేయడంలో తస్కిన్ దిట్ట. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసి కోహ్లీని తస్కిన్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాంటి బంతులు విరాట్‌కు పరీక్షగా నిలుస్తాయి. బంతి స్వింగ్ చేసి కోహ్లీని ఎల్బీడబ్ల్యూ చేయాలని తస్కిన్ ప్లాన్. అలాగే కోహ్లీ బలహీనతలను బట్టి బంతులు వేయాలని బంగ్లా తస్కిన్‌తో బంగ్లా బౌలర్లు యోచిస్తున్నారు.
తైజుల్ ఇస్లాం : ది స్పిన్ కానండ్రమ్ - బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం రూపంలో విరాట్‌కు కాస్త ముప్పు ఉంది! అయితే స్పిన్‌ను ఎదుర్కొవడంలో కోహ్లీకి మంచి రికార్డ్ ఉన్నప్పటికీ, తైజుల్ పిచ్ నుంచి టర్న్ లభిస్తే తనదైన శైలిలో రెచ్చిపోతాడు. బంతిని బౌన్స్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. విరాట్‌ను బోల్తా కొట్టించేందుకు తైజుల్ ఆర్మ్ బాల్ లేదా షార్ప్ స్పిన్ వంటివి వేయవచ్చు.
సమష్ఠి వ్యూహాలు - బంగ్లాదేశ్ జట్టు టీమ్ ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు సమష్ఠిగా వ్యూహాలు రచిస్తోంది. కోహ్లీని వీలైనంత త్వరగా పెవిలియన్‌కు పంపేందుకు ప్లాన్ చేస్తోంది. అందుకే కోహ్లీకి ఊరించే బంతులు వేసి, అందుకు తగ్గట్టుగా ఫీల్డింగ్ సెట్ చేయడం వంటివి చేయొచ్చు.