'కల్కి' అఫీషియల్ టోటల్ రన్ టైమ్ వచ్చేసింది - ఎంత సేపంటే?
Published : Jun 20, 2024, 1:39 PM IST
Prabhas Kalki 2898AD Movie Runtime :ప్రస్తుతం ఎక్కడా చూసిన కల్కి హవానే కనపడుతోంది. సినీప్రియులంతా దీని గురించే మాట్లాడుతున్నారు. రిలీడ్ డేట్(జూన్ 27) కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ రన్ టైమ్ గురించి చర్చ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు అఫీషియల్‌గా రన్ టైమ్ బయటకి వచ్చింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. రన్ టైమ్ 180.55 నిమిషాల నిడివితో రానున్నట్లు తెలిపారు. అంటే ఈ సినిమాను మేకర్స్ మూడు గంటల 55 సెకండ్లకు కట్ చేశారు. మరి ఈ భారీ ట్రీట్‌ను థియేటర్స్‌లో ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారో చూడాలి. కాగా, సినిమాలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.