NBK 50 Years Celebration Guests:నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. టాలీవుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితోపాటు విక్టరీ వెంకటేశ్, శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, శ్రీకాంత్, గోపీచంద్, నాని, దగ్గుబాటి రానా, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు ఈవెంట్లో పాల్గొన్నారు.
NBK గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్- చిరు, వెంకీ సహా స్టార్ హీరోల సందడి
Published : Sep 1, 2024, 9:33 PM IST
NBK 50 Years Celebration (Source: ETV Bharat)
ఇక డైరెక్టర్లలో గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను కూడా ఈవెంట్లో మెరిశారు. టాలీవుడ్ లెజెండ్ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వేడుకకు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.