Published : Jun 19, 2024, 11:04 AM IST
రజినీకాంత్ సినిమాలో నటించినందుకు బాధపడ్డా! : హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Rajinikanth Mamtha MohanDas :సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఆయన నటన,స్టైల్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఆయన సినిమాల్లో నటించడానికి ఒక్క అవకాశం వస్తే చాలని కూడా ఎదురుచూసేవాళ్లు ఉంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం రజనీ సినిమాలో ఎందుకు నటించానా అని బాధపడిందట! ఆమెనే మమతామోహన్ దాస్. "రజనీసార్‌తో కలిసి ఓ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది. 4,5 రోజులు షూటింగ్ చేశాం. ఆ సాంగ్ రిలీజయ్యాక నా షాట్సే లేవు. ఆ తర్వాత ఆ సినిమాలో నటించే లీడ్ హీరోయిన్ 'వేరే హీరోయిన్ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తే నేను చేయను' అని చెప్పినట్లు నాకు తెలిసింది. దీంతో నాకు 3,4 రోజుల టైమ్ వేస్ట్ అయింది. దీంతో నేను బాధపడ్డాను. సినిమా రిలీజయ్యాక బ్యాక్ షాట్లో ఓసారి కనిపించాను" అని మమత చెప్పింది.