national

స్వల్పంగా పెరిగిన వంట గ్యాస్ ధర- ఎంతంటే?

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 12:06 PM IST

Gas Cylinder Price
Gas Cylinder Price (Source: ETV Bharat)

Gas Cylinder Price:వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్​పీజీ సిలిండర్ ధర అతి స్వల్పంగా పెరిగింది. 19 కిలోల గ్యాస్ బండ ధరను రూ.6.5 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు గురువారం ప్రకటించాయి. ఫలితంగా కమర్షియల్ LPG సిలిండర్ ధర దిల్లీలో రూ.1,652.50కు చేరింది. గత నాలుగు నెలలు కమర్షియల్ సిలిండర్ ధర తగ్గగా, ఈసారి మాత్రం స్వల్పంగా పెరిగింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2కిలోల గ్యాస్ బండ ధరలో ఈసారి ఎలాంటి మార్పు లేదు.

మరోవైపు, విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​- ఏటీఎఫ్ ధరను 2శాతం మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా దిల్లీలో కిలోలీటర్​ ఏటీఎఫ్​ ధర రూ.1,827.34కు చేరింది. విమాన ఇంధన ధర పెరగడం వరుసగా ఇది రెండోసారి.

ABOUT THE AUTHOR

...view details