ETV Bharat / snippets

కుదేలైన Nvidia షేర్స్ - ఒక్క రోజులోనే 10% క్రాష్​ - కారణం ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 11:58 AM IST

Nvidia
Nvidia (ETV Bharat)

Nvidia Suffers Massive Losses : అమెరికన్ టెక్నాలజీ కంపెనీ 'ఎన్వీడియా కార్పొరేషన్'​ మంగళవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్​లో ఏకంగా 9.5 శాతం మేర నష్టపోయింది. అంటే ఒక రోజులో ఏకంగా 279 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్​ను కోల్పోయింది. ఎన్వీడియా షేర్​ ధర ఒక రోజులో ఇంతగా క్షీణించడం ఇదే మొదటిసారి. దీనితో మదుపరులు భారీగా నష్టపోయారు.

ఎన్వీడియా సీఈఓ జెన్సన్​ హువాంగ్​ ఇటీవల లింక్డ్​ఇన్​ అప్​డేట్​తో వార్తల్లో నిలిచారు. ఈ ఏఐ హెవీ వెయిట్ కంపెనీ తమ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోంది. పైగా కంపెనీ వ్యాపారం కూడా అనుకున్న స్థాయిలో రాణించడంలేదు. ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఎన్వీడియా షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇదే విధంగా మైక్రోసాఫ్ట్​, ఆల్ఫాబెట్ (గూగుల్​) కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో నష్టాలు చవిచూస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.