Woman Killed Three Year Old Boy :తమ ఇంటి బయట ఆడుకొంటూ అదృశ్యమైన బాలుడు ఎదురింట్లోని వాషింగ్ మిషన్లో విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగింది. బాలుడిది దారుణ హత్యగా అనుమానిస్తున్నారు.
బాలుడ్ని చంపి వాషింగ్ మెషీన్లో కుక్కిన మహిళ! ఆ తర్వాత ఏమైందంటే?
Published : Sep 10, 2024, 12:05 PM IST
ఇంటి బయట ఆడుకొంటున్న సంజయ్(3) అదృశ్యం కావడం వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాసేపటికి ఎదురింట్లో వాషింగ్ మిషన్లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో పోలీసులు 40ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. ఆస్తి విషయంలో బాలుడి కుటుంబం, ఆ మహిళకు మధ్య వివాదాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం తన కొడుకును పోగొట్టుకున్న ఆ మహిళ తీవ్ర మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. భూ వివాదాలతో పాటు అన్ని కోణాల్లోనూ ఈ కేసును విచారిస్తున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమన్నారు.