SC Permission To Gali Janardhan Reddy :మైనింగ్ స్కామ్లో నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి సందర్శించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో తన జిల్లాకు వెళ్లేందుకు జానర్దన్కు మార్గం సుగమైంది. సుప్రీం నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకు రాజకీయ పునర్నజ్మనిచ్చిన గంగావతి నియోజకవర్గానికి మొదటగా వెళ్తానని తెలిపారు. బళ్లారిలోని వివిధ ఆలయాలకు వెళ్తానని, చివరి శ్వాస వరకు బళ్లారిలోనే ఉంటానని అన్నారు. కాగా, ఈ విషయం తెలిసి గాలి అనుచరులు సంబరాలు చేసుకున్నారు.
'చివరి శ్వాస వరకు అక్కడే ఉంటా'- 13ఏళ్ల తర్వాత బళ్లారికి గాలి జనార్దన్ రెడ్డి!
SC Premission To Gali Janardhan Reddy (IANS)
Published : Sep 30, 2024, 7:05 PM IST
మైనింగ్ స్కామ్లో గాలిని 2011 సెప్టెంబర్ 5న సీబీఐ అరెస్ట్ చేసింది. 2015లో కండిషనల్ బెయిల్ వచ్చింది. అయితే ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం ఉందన్న కారణంతో బళ్లారి, అనంతపురం, కర్నూలు జిల్లాలో వెళ్లడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దాదాపు 13ఏళ్ల తర్వాత తాజాగా ఆ జిల్లాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.