Sukesh Chandrashekhar Gifts Jacqueline Fernandez :అక్రమ నగదు చెలామణి ఆరోపణలతో అరెస్టైన సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అయితే, ఆగస్టు 11న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 39వ పుట్టిన రోజు సందర్భంగా, అమెకు ఖరీదైన విహార నౌకను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు జైలు నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్ లేఖ రాశారు.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బర్త్‌డే గిఫ్డ్‌గా కాస్ట్లీ నౌక, 100 ఐఫోన్లు!
Published : Aug 11, 2024, 7:53 PM IST
Sukesh Chandrashekhar Gifts Jacqueline Fernandez (IANS)
'లేడీ జాక్వెలిన్' పేరుతో ఖరీదైన యాచ్ బహుమతిని సిద్ధం చేసినట్లు తెలిపాడు. నౌక ఈ నెలలో చేరుతుందని, దానికి అన్ని అధికారిక పన్నులు ఇప్పటికే చెల్లించానని సుకేశ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. వీటితోపాటు జాక్వెలిన్‌పై చిత్రీకరించిన 'యిమ్మీ యిమ్మీ' పాటను సూపర్‌హిట్ చేసినందుకు 100 ఐఫోన్లు పంచనున్నట్లు ప్రకటించాడు. వాయనాడ్ కొండచరియల బాధితుల కోసం రూ.15 కోట్లు, 300 ఇళ్లను నిర్మిస్తానని హామీ ఇచ్చారు.