national

రిజర్వేషన్ల పెంపుపై నితీశ్ సర్కార్​కు ఎదురుదెబ్బ- హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 12:39 PM IST

SC On Bihar Reservation
SC On Bihar Reservation (ANI)

SC On Bihar Reservation : బిహార్‌లోని ఎన్​డీఏ కూటిమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ ప్రభుత్వం చేసిన చట్టాన్ని నిలుపుదల చేస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరించింది. అయితే హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వం దాఖలు చేసిన దాదాపు 10 పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది. వాటిని సెప్టెంబరులో విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

బిహార్‌లోని దళితులు, గిరిజనులు, బీసీల రిజర్వేషన్ల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ గతేడాది నవంబర్​లో ప్రస్తుత నితీశ్ కుమార్ సర్కారు చట్టం చేసింది. దీని అమలును నిలిపివేస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ సుప్రీంకోర్టును కోరారు.

ABOUT THE AUTHOR

...view details