మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ- చెప్పులు కుట్టే వ్యక్తికి కుట్టు మెషీన్ సాయం
Published : Jul 28, 2024, 9:04 AM IST
Rahul Gandhi Help To Cobbler : తనను కలిసి మరుసటి రోజే చెప్పులు కుట్టుకునే వ్యక్తికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాయం చేశారు. ఆ వ్యక్తికి కుట్టు యంత్రాన్ని పంపించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పరువు నష్టం కేసులో శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ వెళ్లారు. దారిలో రామ్ చేత్ అనే చెప్పులు కుట్టుకనే వ్యక్తి వద్ద ఆగి ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయం చేస్తామని హామి ఇచ్చి వెళ్లిపోయారు. శనివారమే రామ్‌కు కుట్టు మెషీన్ పంపించారు. చెప్పుల కుట్టుకునే వ్యక్తిని కలిసిన మరుసటి రోజే వారి కష్టాలను అర్థం చేసుకుని కుట్టు మెషీన్ పంపించారని యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ అన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి పని సులవవుతుందని, మా నాయకుడిని చూసి గర్విస్తున్నా అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.